హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్ ప్రాజెక్టుల ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్ (ఓఅండ్ ఎం) కోసం నియమించనున్న స్కిల్డ్ సిబ్బంది రెండేండ్ల ప్రొబేషనరీ పీరియడ్ పూర్తి చేయడం తప్పనిసరి. ఈ మేరకు ఓఅండ్‌ఎం విభాగంలో వర్క్ ఇన్‌స్పెక్టర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఆపరేటర్, వైర్‌లెస్ ఆపరేటర్, ల్యాడ్ అటెండెంట్ పోస్టుల డైరెక్ట్ రిక్రూట్మెంట్కు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. జిల్లా యూనిట్‌గా ఈ పోస్టులు భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఐటీఐ లేదా సమాన అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని అధికారులు తెలిపారు. ఈ ఆరు విభాగాల్లో 879 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఇటీవల అనుమతి ఇచ్చింది. మార్గదర్శకాలు ఖరారు కావడంతో త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుందని అధికారులు తెలిపారు.

