- వాటికి, 2016 స్ట్రైక్స్‌కు చాలా తేడా ఉందట
- ఆర్మీ మాజీ సైనికాధికారుల వెల్లడి
- కాం గ్రెస్ చేసినవి సీమాం తర దాడులే
- బెటాలియన్, డివిజనల్ స్థా యుల్లో నే జరుగుతాయి
- 2016లో ఎన్డీయే చేసినవే నిజమైన ‘సర్జికల్ ’ స్ట్రైక్స్
- ప్రభుత్వం మొత్తం ఇన్వాల్వ్ అవ్వడమే కారణం
తమ హయాం లో ఆరు సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని కాంగ్రెస్ చెబుతోంది. వాటిని ఏనాడూ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోలేదంటోంది. కానీ, కాం గ్రెస్ చేసినవి అసలు సర్జికల్ స్ట్రైక్స్ కానే కాదని ఆర్మీ ఉన్నతాధికారులు కొందరు కొట్టి పారేస్తున్నారు. 2016లో ఎన్డీయే హయాంలో చేసిన సర్జికల్ స్ట్రైక్స్ కు , కాంగ్రెస్ చేసిన వాటికి చాలా తేడా ఉందంటున్నారు. 2016 స్ట్రైక్స్ లోని తీవ్రత, ప్రాధాన్యమే ఆ స్ట్రైక్స్ ను‘సర్జికల్’గా మార్చాయంటున్నారు.
ఏంటా తేడా? ఆర్మీ చెబుతున్నదేంటి?
‘‘సీమాంతర ఆపరేషన్లు (క్రాస్ ఎల్వోసీ) చాలా చాలా కామన్. వాటిని ఎప్పుడూ ఎక్కడా రిపోర్ట్ చేయరు. బెటాలియన్, దళాలు, డివిజనల్ స్థా యుల్లో నే ఆపరేషన్లు జరిగిపోతాయి. కాంగ్రెస్ చేసినవి అలాం టి దాడులే. 2016 సర్జికల్ స్ట్రైక్స్ వేరు. ఉరీదాడి తర్వాత భారత సైన్యం పాక్ భూభాగంలోకి వెళ్లి మరీ దాడులు చేసి వచ్చింది. ఈ దాడుల్లో ప్రభుత్వం బాగా ఇన్వాల్వ్ అయింది. ప్రభుత్వం ,ప్రధాని, ప్రధాని కార్యాలయంలోని ఉన్నత స్థాయి అధికారులు, నాటి ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ నేతృత్వంలో విస్తృతంగా చర్చలు జరిగాయి’’ అని ఆర్మీ మాజీలు అంటున్నారు.‘‘గతం లోనూ సీమాంతర దాడులు జరిగినా వాటిని 2016 సర్జికల్ స్ట్రైక్స్‌తో పోల్చలేం . మొత్తం ప్రభుత్వం ఆ దాడుల్లో భాగమైంది. వాటికి, దానికి అదే పెద్ద తేడా” అని రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హూడా చెప్పా రు. 2016 సర్జికల్ స్ట్రైక్స్ సందర్భంగా ఆపరేషనల్ ప్రణాళికలను ఆయనే వేశారు. అంతేకాదు, కాం గ్రెస్ హయాంలో సెక్యూరి టీ డాక్ట్రిన్‌ను తయారు చేసే కీలక పనినీ ఆయనకే అప్పగించారు. శ్రీనగర్‌లోని 15 కార్ప్స్(ఉరీ క్యాం పు బాధ్యతలను చూస్తున్నది అదే)మాజీ చీఫ్ రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సతీశ్ దువా కూడా అదే మాట చెప్పా రు. దాడులు చేసేటప్పుడు లక్ష్యాలు ఎక్కు వగా ఉంటాయని, వేరే సర్వీసులను కూడా అలర్ట్ చేస్తారని అన్నారు.
‘‘సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత పాకిస్థాన్ ప్రతీకార దాడులు చేస్తే..ఎలా? ఈ ప్రశ్నమీదే మొత్తం పడమటి కమాండ్‌ను హై అలర్ట్‌లో పెట్టాం . అంతేకాదు, పాకిస్థాన్‌ను ఎదుర్కోవడానికి అటు ఆర్థికంగా, ఇటు దౌత్యపరంగా అన్ని చర్యలూ తీసుకున్నాం ” అని చెప్పా రు. సర్జికల్ స్ట్రైక్స్ క్రెడిట్ అంతా ప్రభుత్వానికే దక్కుతుందని క్రాస్ ఎల్వోసీ దాడులకు ట్రైనింగ్ , ప్లానింగ్ చీఫ్‌గా పనిచేసిన రిటైర్డ్ మేజర్ జనరల్ నరేశ్ బధాని చెప్పారు. 2016 సర్జికల్ స్ట్రైక్స్ జరగడానికి మూడు నెలల ముందే ఆయన ఉత్తర కమాండ్ నుంచి రిటైర్ అయ్యా రు. ‘‘సర్జికల్ స్ట్రైక్స్ క్రెడిట్ మొత్తం ప్రభుత్వానికే దక్కుతుంది. భారత సైన్యానికి దాడులు చేసే సత్తా ఉంది. మరి,చేయించే సత్తా కూడా ప్రభుత్వం దగ్గర ఉండాలి. అది రాజకీయంగానే సాధ్యమవుతుం ది. కాబట్టి సర్జికల్ స్ట్రైక్స్ పై క్రెడిట్ తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంది. అలాగే ఏదైనా నెగెటివ్‌గా జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది”అని నరేశ్ బంధాని అన్నారు.

