V6 News

కుత్బుల్లాపూర్ లో భారీ అగ్ని ప్రమాదం..స్క్రాప్ గోడౌన్ లో మంటలు

కుత్బుల్లాపూర్ లో భారీ అగ్ని ప్రమాదం..స్క్రాప్ గోడౌన్ లో మంటలు

మేడ్చల్ మల్కా్జ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ లో మంగళవారం (ఏప్రిల్ 28) రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఓ స్క్రాప్ గోడౌన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు  గోడౌన్ మొత్తం వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు, పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేశాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.పూర్తి వివరాల్లోకి వెళితే..
 
మంగళవారం(ఏప్రిల్28) రాత్రి 10గంటల సమయంలో సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని జోత్యి మిల్క్ సెంటర్ కు ఎదురుగా ఉన్న స్క్రాప్ గోడౌన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా కమ్ముకున్నాయి. స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. మంటలువ్యాపించి గోడౌన్ కు దగ్గరలో ఉన్న నివాహ గృహాలకు అంటుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 

స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.. ఆస్థినష్టం ఎంతనేది తెలియాల్సి ఉంది.