రష్యానుంచి భారత్ కు ఎస్-400 ట్రియంఫ్ క్షిపణి వ్యవస్థ నాలుగో యూనిట్ అతి త్వరలో చేరుకోనుంది. మే నెలమొదటి వారంలో భారత్ కు చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటిటికే రష్యా నుంచి ఎస్ 400 ట్రియంఫ్ బయల్దేరినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపారు. ఎస్ 400 క్షిపణి వ్యవస్థ నాలుగో యూనిట్ భారత్ కు చేరితే మన దేశ వైమానిక దళం మరింత బలోపేతం అవుతుందని అధికారులు వెల్లడించారు.
ఎస్ 400 ట్రియంప్ భూమినుంచి ఆకాశానికి ప్రయోగించే అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ. ఇది 400 కి.మీ పరిధిలోని ఫైటర్ జెట్లు, డ్రోన్లు, క్రూయిజ్ , బాలిస్టిక్ క్షిపణులను ఏకకాలంలో గుర్తించి కూల్చి వేయగలదు.
రష్యాతో క్షిపణి వ్యవస్థల కొనుగోలు ఒప్పందం చేసుకుంటే ఆంక్షలు ఎదుర్కొవాల్సి వస్తుందని అమెరికా హెచ్చరించినప్పటికీ.. భారత్ ఏడేండ్ల క్రితం 2018 క్రితమే ఎస్-400 క్షిపణుల కొనుగోలు ఒప్పందంపై సంతకం చేసింది.2018లో రష్యాతో అధునాతన ఎస్ 400 క్షిపణి వ్యవస్థకు చెందిన 5 యూనిట్లను భారత్ కొనుగోలు చేసింది. మార్చిలో మరో ఐదు యూనిట్ల ఎస్ 400 క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.
ఇప్పటికే మూడు ఎస్ 400 యూనిట్లు భారత్ కు రష్యా అందించింది. మేనెల మొదటి వారంలో నాలుగో యూనిట్ మన దేశానికి రానుంది. ఇక మిగిలిన ఐదో యూనిట్ నవంబర్ నాటికి రష్యా అందజేస్తుందని అధికారులు చెబుతున్నారు. ఐదో యూనిట్ భారత్ కు చేరితే ఎస్ 400 క్షిపణి వ్యవస్థ యూనిట్ల సంఖ్య పదికి చేరనున్నాయి.
ఆపరేషన్ సింధూర్‌లో ఎస్-400 కీ రోల్..
ఆపరేషన్ సిందూర్ సమయంలో ఎస్-400 క్షిపణి వ్యవస్థలు కీలక పాత్ర పోషించాయి. 2025 మే 7–10 పాకిస్థాన్‌తో జరిగిన యుద్దంలో ఎస్-400 ట్రియంఫ్‌ను వినియోగించింది సక్సెస్ సాధించింది. సంఘర్షణ జరిగిన కొన్ని వారాల తర్వాత, అదనపు ఎస్-400 వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు మరికొన్ని క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. క్షిపణి ప్లాట్‌ఫాం నుం ఆపరేట్ చేసేందుకు రష్యా ఇప్పటికే భారత సిబ్బంది బృందానికి శిక్షణ ఇచ్చింది.ఒప్పందం ప్రకారం.. ఎస్ 400 క్షిపణి వ్యవస్థ ఐదో యూనిట్ కూడా భారత్ కు చేరితే మన దేశ వైమానిక దళం మరింత బలోపేతం కానుంది.

