ఆటమ్‌‌‌‌‌‌‌‌ వేడర్‌‌‌‌‌‌‌‌దే బెస్ట్ డిజైన్‌‌‌‌‌‌‌‌

ఆటమ్‌‌‌‌‌‌‌‌ వేడర్‌‌‌‌‌‌‌‌దే బెస్ట్ డిజైన్‌‌‌‌‌‌‌‌
  • ఆటమ్‌‌‌‌‌‌‌‌ వేడర్‌‌‌‌‌‌‌‌దే బెస్ట్ డిజైన్‌‌‌‌‌‌‌‌
  • ‘డిజైన్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెన్స్ అవార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ ను దక్కించుకున్న ఆటుమొబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • కేఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో వచ్చిన మొదటి హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ ఇదే

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: కేఫ్ రేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిజైన్‌‌‌‌‌‌‌‌తో ఆకట్టుకుంటున్న ఆటుమొబైల్ బైక్‌‌‌‌‌‌‌‌ ఆటమ్‌‌‌‌‌‌‌‌ వేడర్‌‌‌‌‌‌‌‌ ‘డిజైన్‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌లెన్స్‌‌‌‌‌‌‌‌ అవార్డ్‌‌‌‌‌‌‌‌’ ను దక్కించుకుంది. ఇటువంటి డిజైన్‌‌‌‌‌‌‌‌తో మార్కెట్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చిన మొదటి హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్‌‌‌‌‌‌‌‌ ఇదే ‌‌‌‌‌‌‌‌ కావడం విశేషం.  ఈ–మొబిలిటీ ఫ్లస్‌‌‌‌‌‌‌‌  ఈ అవార్డ్‌‌‌‌‌‌‌‌ను కంపెనీ ప్రతినిధులకు అందించింది.  డిజైన్‌‌‌‌‌‌‌‌ మాత్రమే కాకుండా అన్ని రకాలుగా ఆటమ్ వేడర్‌‌‌‌‌‌‌‌ యువతను ఆకట్టుకుంటోంది. ఈ బండిలో 2.4 కిలోవాట్‌‌‌‌‌‌‌‌అవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాటర్ ప్రూఫ్‌‌‌‌‌‌‌‌ బ్యాటరీని అమర్చారు. దీంతో  ఫుల్ ఛార్జ్‌‌‌‌‌‌‌‌పై 100 కి.మీ  వరకు వెళ్లొచ్చు. ఈ బైక్‌‌‌‌‌‌‌‌ గరిష్ట స్పీడ్‌‌‌‌‌‌‌‌ గంటకు 65 కి.మీ. ‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌ఈడీ ఇండికేటర్లు, టైల్‌‌‌‌‌‌‌‌ ల్యాంప్‌‌‌‌‌‌‌‌ వంటి మరిన్ని ఫీచర్లు ఆటమ్ వేడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. తాజాగానే  ఈ బండికి సంబంధించిన డిజైన్‌‌‌‌‌‌‌‌పై ఆటుమొబైల్ పేటెంట్ దక్కించుకుంది.  

బ్యాటరీ డిజైన్‌‌‌‌‌‌‌‌, ఫ్రేమ్‌‌‌‌‌‌‌‌ మోటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన పేటెంట్స్ ఇంకా రావాల్సి ఉంది. టార్గెట్‌‌‌‌‌‌‌‌ చేసిన గ్రూప్ నుంచి ఇప్పటికే 10 వేల మంది టెస్ట్ డ్రైవ్ చేశారని కంపెనీ వెల్లడించింది. ఈ నెంబర్ రోజు రోజుకి పెరుగుతోందని తెలిపింది. ఆటమ్ వేడర్ బైక్‌‌‌‌‌‌‌‌లను హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని పటాన్‌‌‌‌‌‌‌‌చెరు ప్లాంట్‌‌‌‌‌‌‌‌లో తయారు చేస్తున్నారు.  నెట్‌‌‌‌‌‌‌‌ జీరో కార్బన్ ఎమిషన్స్‌‌‌‌‌‌‌‌తో ఏర్పాటు చేసిన  ప్లాంట్‌‌‌‌‌‌‌‌లో  ఈ బండ్లను తయారు చేస్తున్నామని, తాజాగా ఈ ప్లాంట్ కెపాసిటీని  ఏడాదికి 25 వేల యూనిట్ల నుంచి 3 లక్షల యూనిట్లకు పెంచామని వెల్లడించింది. ఈ ప్లాంట్‌‌‌‌‌‌‌‌లో  20 వేల చదరపు అడుగుల్లో ఆటమ్‌‌‌‌‌‌‌‌ సోలార్ రూఫ్‌‌‌‌‌‌‌‌లను అమర్చామని వివరించింది. కాగా, ఆటమ్‌‌‌‌‌‌‌‌ వేడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆటోమోటివ్ రీసెర్చ్‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌   ఆఫ్ ఇండియా (ఏఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏఐ) అనుమతులు  ఉన్నాయి. ఇండియాలో ఏఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏఐ అనుమతి పొందిన 2 ఎలక్ట్రిక్ బైక్‌‌‌‌‌‌‌‌లలో ఆటమ్ వేడర్ ఒకటి. రానున్న ఫైనాన్షియల్ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 12 వేల బండ్లను అమ్మడాన్ని కంపెనీ టార్గెట్‌‌‌‌‌‌‌‌గా పెట్టుకుంది.

‘ఆటుమొబైల్‌‌‌‌‌‌‌‌లోని అందరూ గర్వించదగ్గ రోజు ఇది. డిజైన్‌‌‌‌‌‌‌‌, పనితీరుకు సంబంధించి  ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫెక్ట్‌‌‌‌‌‌‌‌ ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌ బైక్‌‌‌‌‌‌‌‌ను తీసుకురావడానికి  చాలా కష్టపడ్డాం. యువతే మా ప్రైమరీ టార్గెట్.  స్టైల్‌‌‌‌‌‌‌‌తో పాటు  ఆచరణాత్మకంగా ఉండేలా ఆటమ్‌‌‌‌‌‌‌‌ వేడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డిజైన్ చేశాం. ప్యానెల్‌‌‌‌‌‌‌‌ను ఇదే ఆకర్షించినట్టు ఉంది. ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌ బైక్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో  మంచి డిమాండ్ చూస్తున్నాం,  మార్కెట్‌‌‌‌‌‌‌‌లో బోలెడు అవకాశాలు ఉన్నాయి. మిగిలిన కంపెనీలు సైలెంట్‌‌‌‌‌‌‌‌గా ఉంటే, ఆటుమొబైల్ మాత్రం ఇండియన్ రోడ్లకు, ఇక్కడి కస్టమర్లకు సరిపోయేలా హై స్పీడ్‌‌‌‌‌‌‌‌ ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌ బైక్‌‌‌‌‌‌‌‌ను తెచ్చింది. ఈ అవార్డు ఇచ్చినందుకు ఈమొబిలిటీకి థ్యాంక్స్.   పొల్యూషన్ నుంచి దేశాన్ని కాపాడడంలో ఆటుమొబైల్‌‌‌‌‌‌‌‌ ఒకడుగు  ముందుకేసింది’. 

‌‌‌‌- వంశీ జీ కృష్ణ  ఆటుమొబైల్‌‌‌‌‌‌‌‌  ఫౌండర్