జూన్‌ 12నుంచి స్కూల్స్ ప్రారంభం..టైమింగ్స్ ఇవే

జూన్‌ 12నుంచి స్కూల్స్ ప్రారంభం..టైమింగ్స్ ఇవే

తెలంగాణలోని పాఠశాలలకు సంబంధించిన 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన అకడమిక్‌ క్యాలెండర్‌ను ప్రభుత్వంవిడుదల చేసింది. ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 229 రోజులు స్కూళ్లు పని చేయనున్నాయి. ఈ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం జూన్‌ 12న పాఠశాలలు ప్రారంభమై ఏప్రిల్‌ 23 వరకు కొనసాగనున్నాయి.  2025 ఫిబ్రవరి 28 లోపు పదో తరగతి ప్రి ఫైనల్‌ పరీక్షలు ముగియనున్నాయి.  

మార్చిలో ఫైనల్  పరీక్షలు నిర్వహించనున్నారు.  అక్టోబర్‌ 2 నుంచి 14 వరకు దసరా సెలవులు, డిసెంబర్‌ 23 నుంచి 27 వరకు క్రిస్మస్‌ సెలవులు, జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు. ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 వరకు,  అప్పర్‌ ప్రైమరీకి ఉదయం 9 నుంచి 4.15 వరకు తరగతులు జరగనున్నాయి.  జంటనగరాల్లో  ఉదయం 8.45 నుండి సాయంత్రం 4 వరకు హై స్కూల్స్ నడవనున్నాయి.  

ప్రతీ రోజూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఐదు నిమిషాల పాటు యోగా, మెడిటేషన్ క్లాసులు ఉండనున్నాయి.  45 నిమిషాల పాటు లంచ్ బ్రేక్ ఉండనుంది.  ప్రతి అరు నెలలకు విద్యార్థులందరికీ హెల్త్ చెకప్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది విద్యాశాఖ.  ప్రతి పాఠశాలల్లో 90 శాతం విద్యార్థుల అటెండెన్స్ నమోదు అయ్యేలా చూడాలంది విద్యాశాఖ. విద్యార్థులు పాఠశాలలకు రెగ్యులర్ గా వచ్చేలా ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్ శ్రద్ధ వహించాలని ఆదేశించింది.