హైదరాబాద్, వెలుగు: హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావుతో పాటు మరో 21 మంది న్యాయవాదులకు సీనియర్ న్యాయవాదుల హోదా లభించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ నేతృత్వంలో జరిగిన ఫుల్‌కోర్టు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 22 మంది న్యాయవాదులకు సీనియర్ న్యాయవాదుల హోదా కల్పిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకున్నట్లు రిజిస్ట్రార్ జనరల్ ప్రకటించారు. ఈ హోదా సెప్టెంబరు 16 నుంచి అమల్లోకి వచ్చినట్లు వెల్లడించారు.
