హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్)కు సోమవారం సాయంత్రం నాటికి 2,23,811 దరఖాస్తులు వచ్చాయని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి తెలిపారు. పేపర్ 1కు 68,062, పేపర్ 2కు 12,815 దరఖాస్తులు రాగా, రెండింటికీ 1,42,934 వచ్చాయని చెప్పారు. ఈ నెల 16 సాయంత్రంతో టెట్ దరఖాస్తు గడువు ముగియనుంది. రాష్ట్రంలో గురుకుల పరీక్షలు నడుస్తుండటంతో అభ్యర్థులు ఎక్కువగా టెట్‌పై దృష్టి పెట్టలేదనే వాదనలున్నాయి. ఈ నేపథ్యంలో టెట్‌కు ఎడిట్ ఆప్షన్ ఇచ్చి, వారం రోజుల పాటు గడువు పెంచాలని డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రాంమోహన్ రెడ్డి ఒక ప్రకటనలో కోరారు.
