TTDలో కలకలం రేపుతున్న 2323 జీవో

TTDలో కలకలం రేపుతున్న 2323 జీవో

తిరుమల: ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన 2323 జీవో… TTDలో కలకలం రేపుతోంది. కొత్త జీవోతో టీటీడీలోని 194 మంది ఉద్యోగాలు కోల్పోయారు. యువతకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో జీవో విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సవరించిన జీవో ప్రకారం శ్రీవారి ఆలయ ఓఎస్డీ….. డాలర్  శేషాద్రి కూడా తప్పుకోవాల్సి ఉంది. కానీ ఆ నిబంధన శేషాద్రికి వర్తంచదనడంపై విమర్శలు వస్తున్నాయి.

ఈ జీఓ కానీ అమలులోకి వస్తే వేలాది కుటుంబాలపై ప్రభావం పది రోడ్డున పడనున్నారు. ప్రభుత్వం ఏమాత్రం ముందు చూపులేకుండా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఔట్ సోర్సింగ్ ఏజన్సీల ద్వారా గతంలో నియమితులైన ఉద్యోగుల ప్రస్తావన కొత్తగా ఏర్పాటైన జీవోలో ఎక్కడా లేకపోగా , 2323 జీవోలో మాత్రం 2019 మార్చి 31నాటికి రోల్స్ లో ఉన్న ఔట్ సోర్సింగ్ , కాంట్రాక్టు ఉద్యోగులందరినీ తొలగించాలని పేర్కొనడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

గ్రామ, సచివాలయాల్ని ఏర్పాటు చేయడం ద్వారా లక్షలాది ఉద్యోగాల్ని కల్పించామని సిఎం జగన్మోహన్ రెడ్డి చెప్తూ తాజాగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని తొలగించాలని నిర్ణయించడం అన్యామని అంటున్నారు. కొత్తగా ఏర్పాటయ్యే కార్పొరేషన్ లో ఇప్పటికే పని చేస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల్ని  అబ్జార్బ్ చేస్తారని భావించారు.