తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన 'జన నాయగన్' చిత్రం రిలీజ్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. సినీ రంగానికి గుడ్ బై చెబుతూ.. నటుడిగా ఆయన నటించిన చివరి మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తన రాజకీయ ప్రయాణానికి నాందిగా భావిస్తున్న ఈ చిత్రం సెన్సార్, కోర్టు చిక్కుల్లో కొట్టుమిట్టాడుతుంది. సినిమా రిలీజ్ కాక షాక్ లో ఉన్న చిత్ర బృందానికి, విజయ్ అభిమానులకు మరో షాక్ తగిలింది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ డీల్ ను రద్దు చేసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది.
రూ. 120 కోట్ల OTT డీల్ రద్దు?
ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఈ సినిమా కోసం కుదుర్చుకున్న సుమారు రూ. 120 కోట్ల భారీ డీల్‌ను రద్దు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సెన్సార్ బోర్డు (CBFC) నుంచి క్లియరెన్స్ రాకపోవడం, సినిమా విడుదల తేదీపై స్పష్టత లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని సమాచారం. ఇంత భారీ మొత్తాన్ని అనిశ్చితిలో ఉంచడం ఇష్టం లేకనే అమెజాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది.
సెన్సార్ చిక్కులు.. కోర్టు మెట్లు!
దర్శకుడు హెచ్. వినోద్ తెరకెక్కించిన ఈ చిత్రంలో పొలిటికల్ కంటెంట్ చాలా పవర్‌ఫుల్‌గా ఉందని తెలుస్తోంది. జనవరి 9, 2026న విడుదల కావాల్సిన ఈ చిత్రం, సెన్సార్ బోర్డు అభ్యంతరాల వల్ల ఆగిపోయింది. బోర్డు సభ్యులతో వివాదం తలెత్తడంతో నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ చిత్రం రివైజింగ్ కమిటీ పరిశీలనలో ఉంది. మార్చి 9న జరగాల్సిన స్క్రీనింగ్ కూడా వాయిదా పడటంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది.
2026 ఎన్నికల తర్వాతే విడుదలా?
ప్రస్తుతం తమిళనాడులో మే 2026 అసెంబ్లీ ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఈ తరుణంలో విజయ్ సినిమా విడుదలైతే అది ఓటర్లపై ప్రభావం చూపుతుందని, అందుకే రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే సెన్సార్ బోర్డు అనుమతి నిరాకరిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం, ఈ సినిమాను ఎన్నికలు ముగిసిన తర్వాతే థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. "వైబ్ చెక్" (Vibe Check) పాస్ అయినప్పటికీ, పొలిటికల్ హీట్ వల్ల సినిమా బాక్సాఫీస్ వద్ద ఇబ్బందులు ఎదుర్కోకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అమెజాన్ తో డీల్ క్యాన్సిల్ ?
కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు వంటి స్టార్స్ నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఇంతటి భారీ తారాగణం, క్రేజ్ ఉన్న సినిమా ఓటీటీ డీల్ కోల్పోవడం ఆర్థికంగా పెద్ద దెబ్బే అని చెప్పాలి. సుమారు .రూ. 120 కోట్ల వరకు అమెజాన్ డీల్ చేసుకుందని సమాచారం. ఇప్పడు ఢీల్ క్యాన్సిల్ కావడంతో చిత్ర బృంధం డీలా పడింది. దళపతి విజయ్ లాస్ట్ ఫిల్మ్ కావడంతో 'జన నాయకన్' పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సెన్సార్ అడ్డంకులు దాటుకుని, ఈ రాజకీయ పోరాటం వెండితెరపై ఎప్పుడు మెరుస్తుందో చూడాలి.
