25 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు పదోన్నతి

25 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు పదోన్నతి

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ, దవాఖానలో 25 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు.. ప్రొఫెసర్లుగా పదోన్నతి పొందారు. ఈ మేరకు హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చోంగ్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బ్రాడ్ స్పెషాలిటీ విభాగంలో 21 మంది, సూపర్ స్పెషాలిటీ విభాగంలో 4 మంది ప్రమోషన్ పొందినట్లు ప్రిన్సిపాల్ డా. కే. ఇందిరా తెలిపారు. త్వరలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పదోన్నతుల ప్రక్రియను కూడా చేపట్టనున్నట్లు సమాచారం.