వాషింగ్టన్: ఇరాన్‌తో యుద్ధం అమెరికా ఖజానాపై పెను భారం పడుతోంది. ఈ యుద్ధం కోసం అమెరికా చేస్తున్న ఖర్చు అంచనాలను మించిపోతోందని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అమెరికా కాంగ్రెస్ కమిటీ ముందు పెంటగాన్ సమర్పించిన రిపోర్టు ప్రకారం.. ఇరాన్ యుద్ధం కోసం ఇప్పటివరకు 29 బిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి.
కేవలం 2 వారాల క్రితం రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ కాంగ్రెస్‌కు తెలిపిన 25 బిలియన్ డాలర్ల అంచనా కంటే ఇది 4 బిలియన్ డాలర్లు ఎక్కువ. ఆయుధాల మరమ్మతులు, కొత్త పరికరాల కొనుగోలు, సైనిక కార్యకలాపాల నిర్వహణ ఖర్చులు పెరగడమే దీనికి కారణమని పెంటగాన్ వెల్లడించింది.
