న్యూ ఐడియా.. రీసైకిల్డ్‌‌‌‌ ప్లాస్టిక్‌ తో బెంచీలు

న్యూ ఐడియా.. రీసైకిల్డ్‌‌‌‌ ప్లాస్టిక్‌ తో బెంచీలు

ముంబై: ప్లాస్టిక్‌ నిషేధానికి, స్వచ్ఛ భారత్‌ అభియాన్‌‌‌‌కు నడుం బిగించిన రైల్వే శాఖ సరికొత్త బెంచ్‌‌‌‌లను రూపొందించింది. రీసైకిల్డ్‌‌‌‌ ప్లాస్టిక్‌ తో
బెంచ్‌‌‌‌ను తయారు చేసింది. సౌత్‌ ముంబైలోని చర్చ్‌‌‌‌గేట్‌‌‌‌ రైల్వేస్టేషన్‌‌‌‌లో మూడు బెంచ్‌‌‌‌లను ఏర్పాటు చేసినట్లు ట్వీట్‌‌‌‌ చేసింది. ఎం/ఎస్‌‌‌‌ బిస్లరీ
ఇంటర్నేషనల్‌‌‌‌ ప్రైవేట్‌‌‌‌ లిమిటెడ్‌ తో కలిసి చేపట్టిన‘బాటిల్స్‌‌‌‌ ఫర్‌‌‌‌‌‌‌‌ చేంజ్‌‌‌‌’ ప్రోగ్రామ్‌‌‌‌లో సేకరించి నబాటిల్స్‌‌‌‌తో వీటిని తయారు చేశారు. బాటిల్స్‌‌‌‌తో పాటు ఎంఎల్‌‌‌‌పీ, ప్లాస్టిక్‌ బ్యాగ్స్‌‌‌‌, సాఫ్ట్‌‌‌‌ ప్లాస్టిక్స్‌‌‌‌ను ఉపయోగించి వీటిని చేశారు. ఒక్కో బెంచ్‌‌‌‌కు 4050 కేజీల ప్లాస్టిక్‌ అవసరమవుతుంది. ఈ బెంచ్‌‌‌‌లు
పూర్తి వాటర్‌‌‌‌‌‌‌‌ ప్రూఫ్‌ , ఔట్‌‌‌‌డోర్‌‌‌‌‌‌‌‌ లొకేషన్స్‌‌‌‌లో వీటిని ఉపయోగించవచ్చని రైల్వే అధికారులు చెప్పారు.