ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు.కాంకేర్ జిల్లాలో శనివారం (మే 2) మావోయిస్టులు అమర్చిన బాంబులు పేలి ముగ్గురు జవాన్లు చనిపోయారు. మార్చి 31 న చత్తీస్ గఢ్ ను మావోయిస్టులు లేని రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత మావోయిస్టులతో సంబంధం ఉన్న తొలి పేలుడు ఇది.
నారాయణ్ పూర్ జిల్లాకు ఆనుకొని ఛోటేబేతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీప్రాంతంలో ఈ పేలుడు జరిగింది.గతంలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీలను గుర్తించి నిర్వీర్యం చేస్తున్న క్రమంలో బాంబు పేలి డీఆర్జీ టీంలోని ముగ్గురు చనిపోయారని ఐజీ బస్తర్ పి సుందర్‌రాజ్ తెలిపారు.
►ALSO READ | స్మార్ట్ మీటర్లు పగిలిపోతున్నయ్.. ఉత్తరప్రదేశ్లో ఊరూరా వ్యాపిస్తున్న మహిళల ఆందోళనలు
