హైదరాబాద్ సిటీ, వెలుగు: రేషన్ కార్డు లబ్ధిదారులకు బుధవారం నుంచి మూడు నెలల రేషన్పంపిణీ చేయనున్నట్లు చీఫ్ రేషనింగ్ అధికారి రాజిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 8,40,345 ఆహార భద్రతా కార్డులు ఉండగా.. అందులో నమోదైన 32,24,284 మందికి 59,510.604 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కేవైసీ చేసుకోని వారు వెంటనే చేసుకోవాలన్నారు.
