భారీ మ్యూజిక్ మధ్య అబాకస్ పరీక్ష..ఏకాగ్రతతో అదరగొట్టిన 3,200 మంది చిన్నారులు

భారీ మ్యూజిక్ మధ్య అబాకస్ పరీక్ష..ఏకాగ్రతతో అదరగొట్టిన 3,200 మంది చిన్నారులు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటీ, వెలుగు: పరీక్షా హాల్ అనగానే నిశ్శబ్దం, ఒత్తిడి, ఆందోళన సహజం. కానీ దీనికి భిన్నంగా చుట్టూ భారీ శబ్దంతో సంగీతం మార్మోగుతున్నా..ఏ మాత్రం చెదరకుండా వేలాది మంది చిన్నారులు ఆటపాటలతో ఎగ్జామ్ రాసి అందరినీ ఆశ్చర్యపరిచారు. హైదరాబాద్​లోని శంషాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లాసిక్  కన్వెన్షన్ త్రీలో ఆదివారం నిర్వహించిన ‘తెలంగాణ రీజినల్ ప్రాడిజీ ఛాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్-2026’ లో ఈ వినూత్న దృశ్యం ఆవిష్కృతమైంది. 

ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐపీ (ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐపీ) అబాకస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మెంటల్ అర్థమెటిక్ పోటీల్లో ఐదు నుంచి 14 ఏండ్ల వయస్సున్న దాదాపు 3,200 మందికి పైగా చిన్నారులు పాల్గొని ప్రతిభను చాటారు. డిజిటల్ యుగంలో ఏకాగ్రతను నిలుపుకోవడం కష్టమని, అందుకే దృష్టి మరల్చే పరిస్థితుల్లోనూ పిల్లల ఏకాగ్రతను టెస్ట్​చేయడానికి ఈ పరీక్ష నిర్వహించామని ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐపీ అబాకస్ తెలంగాణ హెడ్ శ్రీ భరత్, సిప్ అకాడమీ సీనియర్ ప్రతినిధి ఉమా స్వామినాథన్  వివరించారు.