పెరుగుతున్న బుకింగ్లతో నీటి సరఫరాలో ఇబ్బంది : వాటర్ బోర్డు ఎండీ అశోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి

పెరుగుతున్న బుకింగ్లతో  నీటి సరఫరాలో ఇబ్బంది : వాటర్ బోర్డు ఎండీ అశోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి

హైదరాబాద్​సిటీ, వెలుగు : పెరుగుతున్న ట్యాంకర్ల బుకింగ్​తో సరఫరా కొంత ఇబ్బందిగానే ఉన్నా పెండెన్సీని (పెండింగ్​లో ఉండడం) తగ్గించేలా అధికారులు పని చేయాలని వాటర్​బోర్డ్​ఎండీ అశోక్​రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కంటింజెన్సీ ప్లాన్, ట్యాంకర్ బుకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, డెలివరీలు, ఫిల్లింగ్ స్టేషన్ల కెపాసిటీ, ఇంకుడు గుంతల నిర్మాణంపై సమీక్ష సమావేశం నిర్వహించారు.  బుకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల పెండెన్సీ తగ్గించేందుకు రోజుకు కనీసం 11 వేల ట్రిప్పులు డెలివరీ చేయాలని ఆదేశించారు. 

బోర్డు పరిధిలో 95 ఫిల్లింగ్ స్టేషన్లు ఉండగా, బోడుప్పల్, షాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్, ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్, కొత్తపేట, గాజులరామారం, పీర్జాదిగూడ, మంగాపురం ప్రాంతాల్లో కొంత మేరకు పెండెన్సీ ఉందని, ఈ ప్రాంతాల్లో ప్రత్యేకంగా పర్యవేక్షించాలన్నారు. ఇంకుడు గుంతల నిర్మాణాలకు బడ్జెట్ కేటాయించినా అనేక ప్రాంతాల్లో పనులు ప్రారంభం కాకపోవడం, పూర్తయిన పనుల వివరాలను ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నమోదు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.