లెన్నాక్స్ బౌలింగ్ విజృంభణ.. వెస్టిండీస్ పై న్యూజిలాండ్ విజయం

లెన్నాక్స్ బౌలింగ్ విజృంభణ.. వెస్టిండీస్ పై న్యూజిలాండ్ విజయం

 గమానా :   గయానాలో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ ఐదు వికెట్ల తేడాతో వెస్టిండీస్‌‌ను ఓడించి ఐదు మ్యాచ్‌‌ల సిరీస్‌‌ను 1-– 1తో సమం చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 63 పరుగులకు వికెట్ లేకుండా నిలిచినా,  లెఫ్ట్​ హ్యాండ్​ స్పిన్నర్ జేడెన్ లెన్నాక్స్ (5/19)  బౌలింగ్‌‌ దాటికి కుప్పకూలి 138 పరుగులకు ఆలౌటైంది.

జాన్ క్యాంప్‌‌బెల్ 43, అమీర్ జంగూ 24 పరుగులు చేశారు. అనంతరం కఠినమైన పిచ్‌‌పై లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ 96/5తో ఇబ్బందిపడ్డా, టామ్ లాథమ్ అజేయ 37, మార్క్ బ్రేస్‌‌వెల్ అజేయ 18 పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చారు. విల్ యంగ్ 28, డారిల్ మిచెల్ 28 పరుగులతో రాణించారు. ఈ విజయంతో వన్డేల్లో న్యూజిలాండ్‌‌కు ఇది 400వ గెలుపు కాగా, సిరీస్‌‌లో మూడో మ్యాచ్ గురువారం గయానాలో జరగనుంది.