హైదరాబాద్లో ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు

హైదరాబాద్లో ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు

రాష్ట్రంలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. మరోవైపు హైదరాబాద్ లో వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలో నగరంలో ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేశారు. నేటి నుంచి మూడు రోజుల పాటు దాదాపు 34 ఎంఎంటీఎస్ రైళ్ళ సర్వీసులను నిలిపివేస్తన్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. కాగా, హైదరాబాద్ మరో  మూడు రోజుల పాటు మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది.