అంబర్పేట్ లోని స్టూడెంట్స్ దగ్గర ఎండీఎంఏ పట్టివేత... నలుగురు అరెస్టు..

అంబర్పేట్ లోని స్టూడెంట్స్ దగ్గర ఎండీఎంఏ పట్టివేత... నలుగురు అరెస్టు..

అంబర్​పేట్, వెలుగు: స్పెషల్ టాస్క్​ఫోర్స్, కాచిగూడ ఎక్సైజ్ పోలీసులు కలిసి శుక్రవారం 4.62 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. సయ్యద్ ఫైజల్, అన్షు ప్రసాద్, మహమ్మద్ అలీ, అండువల్లి ప్రీతి వర్ధన్ స్టూడెంట్స్..శుక్రవారం అంబర్​పేట్​లోని రాధా నిలయం వద్ద రోడ్డుపై కారు, టూ వీలర్​పై అనుమాదాస్పదంగా తిరుగుతూ కనిపించారు. ఆపి తనిఖీ చేయగా 4.62 గ్రాములు ఎండీఎంఏ దొరికింది. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఇన్​స్పెక్టర్​శ్రీధర్​తెలిపారు.