సుల్తానాబాద్ మండలంలో వరి కొయ్యలకు నిప్పుతో 50 ఎకరాల్లో మంటలు

సుల్తానాబాద్ మండలంలో వరి కొయ్యలకు నిప్పుతో 50 ఎకరాల్లో మంటలు
  •     కాలిపోయిన మోటార్లు, వైర్లు

సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణపూర్, భూపతిపూర్ గ్రామాల్లోని పంట పొలాల్లో ఉన్న వరి కొయ్యలకు గురువారం గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. 

దీంతో నారాయణపూర్ శివారులో దాదాపు 50 ఎకరాల్లో మంటలు వ్యాపించి వరిగడ్డి, బోరు బావుల వైర్లు, మోటర్లు అగ్నికి ఆహుతయ్యాయి. గ్రామపంచాయతీ సిబ్బంది వాటర్ ట్యాంకర్ తో మంటలను అర్పివేశారు.