హెచ్సీయూలో 50 ల్యాప్టాప్లు మాయం.. ఇంటి దొంగల పనేనని అనుమానం..!

హెచ్సీయూలో 50 ల్యాప్టాప్లు మాయం.. ఇంటి దొంగల పనేనని అనుమానం..!

గచ్చిబౌలి, వెలుగు: బయటి వ్యక్తులకు ప్రవేశం లేకుండా పటిష్ట బందోబస్తు మధ్య ఉండే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దొంగతనం జరగడం సంచలనంగా మారింది. వర్సిటీలోని సీఆర్ రావు ఇన్​స్టిట్యూట్ క్లాస్​రూమ్​లో ఆదివారం రాత్రి గుర్తు తెలియని దొంగలు కిటికీ గ్రిల్స్ తొలగించి లోపలికి చొరబడి 50 ల్యాప్​టాప్​లు ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం క్లాస్​రూమ్​లో ల్యాప్‌‌‌‌‌‌‌‌టాప్‌‌‌‌‌‌‌‌లు కనిపించకపోవడంతో వర్సిటీ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ పోలీసులకు సమాచారం అందించింది. 

ఘటనా స్థలానికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు కిటికీ గ్రిల్స్ తొలగించబడినట్లు, సమీపంలో కారు టైర్ల గుర్తులు ఉన్నట్లు గమనించారు. ఇంత పెద్ద ఎత్తున ల్యాప్​టాప్​లు ఉన్న విషయం వర్సిటీలోని కొందరికే తెలిసి ఉంటుందని, శుక్రవారమే ఈ ల్యాప్​టాప్​లు తీసుకొచ్చినట్లు తెలియడంతో ఇది ఇంటర్నల్ దొంగతనమో లేక బయటి వ్యక్తుల సహకారంతో జరిగిందో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.