మహాత్మా జ్యోతిబాఫూలే ప్రజాభవన్ లో సీఎం ప్రజావాణికి 585 దరఖాస్తులు

మహాత్మా జ్యోతిబాఫూలే ప్రజాభవన్ లో సీఎం ప్రజావాణికి 585 దరఖాస్తులు

హైదరాబాద్, వెలుగు: మహాత్మా జ్యోతిబాఫూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి మొత్తం 585 దరఖాస్తులు వచ్చినట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి తెలిపారు. 

ఈ కార్యక్రమాన్ని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ప్రతి శాఖ డెస్క్ వద్దకు వెళ్లి కార్యక్రమం అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రజావాణికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రజావాణి అమలు తీరును ఆయనకు చిన్నారెడ్డి వివరించారు.