60 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు స్వాధీనం..వాణిజ్య సంస్థలపై ఆకస్మిక దాడులు 

60 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు స్వాధీనం..వాణిజ్య సంస్థలపై ఆకస్మిక దాడులు 

హనుమకొండ, వెలుగు: గ్యాస్ కొరత నేపథ్యంలో కొంతమంది షాపుల యజమానులు డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తున్నారు. దీంతో రాష్ట్ర సివిల్ సప్లయిస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాల మేరకు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం వరంగల్ నగరంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

వివిధ షాపుల నుంచి వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న 60 డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగించిన వ్యక్తులపై కేసులు నమోదు చేసి అత్యవసర వస్తువుల చట్టం సెక్షన్ 6ఏ కింద చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో  ఎన్​ఫోర్స్​మెంట్​ టీం సభ్యులు డీటీ భద్రునాయక్, వేణుగోపాల్, సదానందం తదితరులు పాల్గొన్నారు.