మెదక్ టౌన్, వెలుగు: డిప్లొమా కోర్సుల్లో అనాథ, నిరుపేద స్టూడెంట్స్ కు 70 శాతం సీట్లు అందుబాటులో ఉన్నాయని, అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ సూచించారు. బుధవారం ఆమె మాట్లాడుతూ హైదరాబాద్ దుర్గాబాయి దేశ్‌ముఖ్ ప్రభుత్వ మహిళా సాంకేతిక శిక్షణ సంస్థ (ఎస్డీడీజీడబ్ల్యుటీటీఐ) యూసుఫ్‌గూడలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (డిప్లొమా ఇన్ డీసీఈ, డీసీఎస్ఈ, డీఈసీఈ, డీఈఈఈ) విభాగాల్లో మూడేండ్ల ఫుల్-టైమ్ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయని ఇంటర్ విద్యార్థులు అర్హులని తెలిపారు. sddgwtti.dte.telangana.gov.in.. వెబ్సైట్లో అప్లై చేసుకోవాలని సూచించారు.

