హైదరాబాద్, వెలుగు : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్లు చేపట్టేందుకు నిర్వహిం చిన టీజీఐసెట్ –2024 ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఐసెట్‌లో మొత్తం 91.92% మంది అర్హత సాధించారు. శుక్రవారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫీసులో టీజీసీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, కాకతీయ యూనివర్సిటీ ఇన్చార్జ్ వీసీ వాకాటి కరుణ ఫలితాలను రిలీజ్ చేశారు.
ఐసెట్‌కు మొత్తంగా 77,942 మంది అటెండ్ అయ్యారు. అందులో 71, 647 మంది క్వాలిఫై అయ్యారు. 36, 806 మంది అబ్బాయిలు పరీక్ష రాయగా.. 33,928 మంది, అమ్మాయిలు 41,135 మంది పరీక్ష రాస్తే.. 37,718 మంది అర్హత సాధించారు. వీరితో పాటు ఓ ట్రాన్స్ జెండర్ క్వాలిఫై అయ్యారు. ఐసెట్‌లో హైదరాబాద్‌కు చెందిన మున్నేబుల్లా హుస్సేనీ టాపర్‌గా నిలవగా, రంగారెడ్డి జిల్లాకు చెందిన జెల్ల భరత్ రెండో ర్యాంకు సాధించారు.