గతి శక్తి ప్లాన్‌: రూ.100 లక్షల కోట్లు ప్రకటించిన ప్రధాని మోడీ

గతి శక్తి ప్లాన్‌: రూ.100 లక్షల కోట్లు ప్రకటించిన ప్రధాని మోడీ

దేశ ఆర్థిక ప్రగతికి సంబంధించి భారీ ప్లాన్‌ను ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోడీ. 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట కోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధాని ఆ తర్వాత జాతినుద్దేశించి ప్రసంగించారు. భవిష్యత్తులో దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్‌ను ప్రకటించారు. దీనికి గతి శక్తి ప్లాన్ అని పేరు పెట్టిన మోడీ.. రానున్న రోజుల్లో రూ.100 లక్షల కోట్లు నిధులను ఖర్చు చేస్తామని చెప్పారు. గ్లోబల్‌గా పోటీ పడే స్థాయిలో లోకల్ మాన్యుఫాక్చరర్స్‌ను అభివృద్ధి చేసేందుకు గతి శక్తి సాయం చేస్తుందని ఆయన అన్నారు. భవిష్యత్తులో కొత్త ఎకనమిక్ జోన్లు ఏర్పాటు చేసేందుకు బాటలు వేస్తుందని, యువతకు భారీ స్థాయిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. రానున్న 25 ఏండ్లను లక్ష్యంగా పెట్టుకుని భారత్‌ కొత్త ప్రతిజ్ఞ తీసుకోవాలని ఆయన అన్నారు. అన్ని రంగాల్లో భారీ స్థాయిలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెంచేందుకు రూ.100 లక్షల కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. నెక్స్ట్‌ జనరేషన్‌ టెక్నాలజీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, వరల్డ్ క్లాస్‌ మాన్యుఫాక్చర్, ఇన్నోవేషన్స్‌ను అందిపుచ్చుకొని భారత్ ముందుకు దూసుకెళ్లాలని అన్నారు. చిన్న చిన్న పల్లెల్లో సైతం ఫైబర్ గ్రిడ్ లాంటివి 

 100వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోయే నాటికి పూర్తి స్థాయి ఆత్మ నిర్భర్‌‌ భారత్ నిర్మాణమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు.