V6 News

ఛత్తీస్‌గఢ్‌లో కొండను ఢీకొట్టిన ప్రైవేట్ జెట్.. పైలట్, కో-పైలట్ ఇద్దరు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో కొండను ఢీకొట్టిన ప్రైవేట్ జెట్.. పైలట్, కో-పైలట్ ఇద్దరు మృతి

రాయ్‎పూర్: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. జష్‌పూర్ జిల్లాలోని ఆరా కొండను ఢీకొట్టి ఓ ప్రైవేట్ జెట్ కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్, కో పైలట్ ఇద్దరు మరణించారు.  సమాచారం అందుకున్న అధికారులు, రెస్క్యూ టీమ్స్ హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టాయి. స్థానికుల కథనం ప్రకారం.. జష్‌పూర్-నారాయణ్‌పూర్ అటవీ ప్రాంతంలోని ఒక చెట్టును ఢీకొనడంతో విమానం కూలిపోయింది.

జష్‌పూర్ జిల్లా ఎస్పీ లాల్ ఉమ్మేద్ సింగ్‌తో సహా సీనియర్ పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఇతర ప్రయాణికులు ఎవరైనా ఉన్నారా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది. కొండపై కూలిపోయిన జెట్ విమానం నుంచి దట్టమైన పొగ, మంటలు వెలువడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

►ALSO READ | ఆన్‌లైన్ 'రేప్ అకాడమీలు': మత్తుమందు ఇచ్చి మరీ పైశాచికం.. తస్మాత్ జాగ్రత్త