షాద్ నగర్కు 8 మెట్రో బస్సులు..ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

షాద్ నగర్కు 8 మెట్రో బస్సులు..ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
  •     ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

షాద్ నగర్, వెలుగు:  ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలను కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని షాద్‌‌‌‌నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు. బుధవారం షాద్​నగర్ బస్టాండ్ ఆవరణలో కొత్తగా మంజూరైన 8 సిటీ మెట్రో బస్సు సర్వీసులను ఆయన ప్రారంభించారు.కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అందే మోహన్ ముదిరాజ్, పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు.