ఒమన్ తీరంలో హార్ముజ్ జలసంధిలో మరో భారతీయ నౌకపై దాడి జరిగింది. నౌకలో ఉన్న భారతీయ నావికుల్లో ఒకరు మిస్సయ్యారు. మరో పదిమందిని కోస్ట్ గార్డ్స్ రక్షించారు. వాణిజ్యనౌకపై జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది.
హార్ముజ్ లో నౌకలపై నిరంతరం జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.. తక్షణమే దాడులు నిలిపివేయాలని, జరుగుతున్న దౌత్యపరమైన చర్చలు కొలిక్కి తెచ్చి నౌకల రాకపోకలను సురక్షితంగా కొనసాగించాలని భారత్ పిలుపునిచ్చింది. అమెరికా, ఇరాన్‌ల మధ్య కాల్పుల విరమణ ముగిసిన తర్వాత పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు తీవ్రమైన విషయం తెలిసిందే.
Our statement on the attack on a commercial vessel off the coast of Oman ⬇️
— Randhir Jaiswal (@MEAIndia) July 12, 2026
🔗 https://t.co/JtqdfO6iJ0 pic.twitter.com/V6jD6zJOtx
