వయసుకు మైనర్లు.. న్యూడ్ కాల్స్, బ్లాక్ మెయిలింగ్.. లైంగిక వేధింపులు..

వయసుకు మైనర్లు.. న్యూడ్ కాల్స్, బ్లాక్ మెయిలింగ్.. లైంగిక వేధింపులు..

స్మార్ట్ ఫోన్ పుణ్యమా అని.. పిల్లలు వయసుకు మించిన పనులు చేస్తూ జీవితాలనే నాశనం చేసుకుంటున్నారు. వీడియో గేమ్స్, ఇంస్టాగ్రామ్ రీల్స్, బెట్టింగ్ అప్స్ అంటూ నాశనం అయ్యేటోళ్లు కొంతమంది అయితే.. న్యూడ్ కాల్స్, సెక్స్ చాట్ అంటూ వయసుకు మించిన పనులు చేసి మరికొంతమంది నాశనం అవుతున్నారు. ఇలాగే ఆదిలాబాద్ జిల్లాలో పలువురు మైనర్లు కటకటాల పాలయ్యారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

ఆదిలాబాద్ జిల్లా,గుడిహథ్నూర్ లో మైనర్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఎనిమిది మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు పోలీసులు. అమ్మాయి తో ‌న్యూడ్ కాల్ మాట్లాడిన బాలుడు ఆ న్యూడ్ కాల్ రికార్డు ను  తన స్నేహితులకు పార్వర్డ్  చేశాడు. తన స్నేహితులతో కలిసి బాధితురాలిని మానసికంగా వేధించారు. స్నేహితులతో కలిసి బాధితురాలిని లైంగికంగా వేధించారు నిందితులు.

 వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితులపై పోక్సో కేసు నమోదు చేశారు  గుడియత్నూర్ పోలీసులు.ఇచ్చోడ పోలీసులు, షీ టీం బృందం కలిసి స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులలో ఇద్దరు మైనర్లు, ఆరుగురు మేజర్లు ఉన్నట్లు తెలిపారు పోలీసులు. నిందితుల వద్ద నుండి ఏడు మొబైల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.