హైదరాబాద్: హైదరాబాద్ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని(e,w,s) కాలనీకి చెందిన గిరిబాబు కుటుంబం మే 30వ తేదీన యాదగిరిగుట్ట దైవ దర్శనానికి వెళ్లింది. మరుసటి రోజున.. మే 31వ తేదీన గిరిబాబు ఫ్యామిలీ ఇంటికొచ్చి చూసేసరికి బీరువా తాళాలు తీసి దొంగలు దోచుకున్నట్లు అర్థమైంది. బీరువాలోని 8 తులాల బంగారం, ఒక కిలో వెండి కనిపించకపోవడంతో బండ్లగూడ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు.
బండ్లగూడ ఇన్స్పెక్టర్ దేవేందర్ కేసు నమోదు చేసుకొని డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ విష్ణువర్ధన్కు కేసును అప్పజెప్పడంతో క్రైమ్ సిబ్బంది, క్లూస్ టీం ఆధారాలు సేకరించి విచారణ చేపట్టారు. బండ్లగూడ ప్రాంతానికి చెందిన కరుడుగట్టిన మహిళ నరసమ్మను పోలీసులు అదుపులోకి తీసుకొని తమలైన శైలిలో విచారించగా నేరం చేసినట్లు అంగీకరించడంతో ఆ మహిళ వద్ద నుంచి 8 తులాల బంగారం, ఒక కిలో వెండి స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు.
