ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు ఫీజుల పేరుతో రాసిరంపాన పెడుతున్నాయి. అరకొర బకాయి ఉన్న ఫీజుల విషయంలోనూ కఠినంగా వ్యవహరిస్తూ.. అందరి ముందు పిల్లలను అవమానాలకు గురి చేస్తున్నాయి. పంజాబ్ రాష్ట్రంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇంటర్మీడియట్ చదువుతున్న 17 ఏళ్ల యువతికి.. 20 వేల రూపాయల ఫీజు బకాయి పడింది. ఫీజు విషయంలో మిగతా స్డూడెంట్స్, టీచర్ల ముందు కాలేజీ యామాన్యం అవమానించింది. అందరి ముందే ఫీజు బకాయిపై కాలేజీ యజమాన్యం వ్యవహరించిన తీరుతో.. అవమానానికి గురైన ఆ స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకున్నది. ఇప్పుడు పంజాబ్ రాష్ట్రంలో ఈ ఘటనతో స్టూడెంట్స్, పేరంట్స్ రగిలిపోతున్నారు. ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల ఫీజుల దోపిడీ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. జనం నుంచి వస్తున్న వ్యతిరేకతను సర్దిచెప్పేందుకు నానా తంటాలు పడుతుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పంజాబ్ లోని అమృత్ సర్ సదర్ ప్రాంతంలో 12 తరగతి చదువుతున్న 17 ఏళ్ల ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. చనిపోయే ముందు తన చావుకు కారణం పాఠశాల యాజమాన్యమే అని మరణ వాంగ్మూలం రికార్డు చేసింది. ఫీజుల విషయంలో తనను స్కూల్ మేనేజ్ మెంట్ తనను మానసికంగా వేధింపులకు గురి చేశారని వాంగ్మూలంలో తెలిపింది. ఈఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఫీజుల పేరుతో విద్యాసంస్థల వేధింపులపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు మేనత్త వద్ద ఉండి చదువు కొనసాగిస్తుండంగా స్కూల్ ఫీజు చెల్లించడంలో లేట్ అయింది. 20వేలు ఫీజు బకాయి ఉండటంతో పదే పదే బాధితురాలిని స్కూల్ యాజమాన్యం వేధించారని పలుమార్లు ఒంటరిగా గదిలోకి పిలిచి మానసికంగా వేధించారని మే 22 న విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. శనివారం రాత్రి చికిత్స పొందుతూ చనిపోయింది. మరణించే ముందు, బాధితురాలు తన ఆస్పత్రి మంచం పైనుంచి వీడియో రికార్డ్ చేసింది. తాను చనిపోయేందుకు కారణాన్ని వివరించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. విద్యార్థిని దుస్థితికి స్కూల్ మేనేజ్ మెంట్
కారణమని తీవ్ర ఆరోపణలు వచ్చాయి.
ఈ ఘటనపై పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్‌జోత్ సింగ్ బైన్స్ తీవ్రంగా పరిగణించారు. ఫీజులు చెల్లించలేని విద్యార్థుల పట్ల స్కూల్ యాజమాన్యం తీరును తప్పుబట్టారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి ఆత్మహత్యకు ప్రేరేపించిన స్కూల్ యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. ఈ ఘటనతో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
#WATCH | Punjab Education Minister Harjot Singh Bains says, "It is very sad news that a 17-year-old girl has committed suicide, in which she alleges that the school harassed her. It is due to various reasons like not paying fees or other reasons. Taking it very seriously, we have… pic.twitter.com/dkhXzgOawp
— ANI (@ANI) June 2, 2026
