ఎయిర్​పోర్టులో 80 ఐ ఫోన్లు సీజ్

ఎయిర్​పోర్టులో 80 ఐ ఫోన్లు సీజ్

శంషాబాద్, వెలుగు: అక్రమంగా ఐ ఫోన్లను తరలిస్తున్న ఇద్దరిని శంషాబాద్ ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. గురువారం షార్జా నుంచి ఫ్లైట్​లో ఎయిర్ పోర్టుకి చేరుకున్న ఇద్దరు ప్యాసింజర్లను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. వారి దగ్గర 80 ఐ ఫోన్లను గుర్తించారు. ఐ ఫోన్లతో పాటు రూ.4 లక్షల క్యాష్​ను కస్టమ్స్​ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ ఫోన్ల విలువ రూ.కోటి 65 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఇద్దరు ప్యాసింజర్లతో పాటు ఫోన్లను కలెక్ట్ చేసుకునేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చిన మరో వ్యక్తిని సైతం అదుపులోకి తీసుకున్నారు. కేసు ఫైల్ చేసినట్లు అధికారులు తెలిపారు.