ఢిల్లీ లిక్కర్ కేసు : కవిత ఇంటికి సమన్లతో వెళ్లిన సీబీఐ

ఢిల్లీ లిక్కర్ కేసు : కవిత ఇంటికి సమన్లతో వెళ్లిన సీబీఐ

ఢిల్లీ లిక్కర్ కేసులో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ సమన్లు అందజేసింది. మార్చి 12న హైదరాబాద్ లోని కవిత ఇంటికి వెళ్లిన  సీబీఐ అధికారులు ఆమె తరపున తన  భర్త అనిల్ కు ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన నోటీసులను ఇచ్చారు. మార్చి16 న  ఢిల్లీ హైకోర్టు విచారణకు హాజరు కావాలని నోటీసులో తెలిపారు అధికారులు.  లిక్కర్ స్కామ్ కేసులో కవితకు ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు  క్లీన్ చిట్ ఇవ్వడంపై సీబీఐ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది.  ఈ క్రమంలోనే కవితకు  సీబీఐ నోటీసులు ఇచ్చింది.

కవితతో పాటు 23 మందికి క్లీన్ చిట్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ స్పెషల్ కోర్టు (రౌస్ ఎవెన్యూ కోర్టు) 2026 ఫిబ్రవరి 27 న కీలక తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంలో సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తోసిపుచ్చుతూ..  కవిత(ఏ 17)కు క్లీన్ చిట్ ఇచ్చింది. అలాగే  ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిసోడియాతో సహా మరో 21(ఏ1 నుంచి ఏ23 వరకు) మందిపై దాఖలైన అభియోగాలను కోర్టు కొట్టివేసింది. సుదీర్ఘ విచారణ అనంతరం  సీబీఐ స్పెషల్ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి (పీసీ యాక్ట్) జితేంద్ర సింగ్ 598 పేజీలతో వివరణాత్మక తీర్పును వెలువరించారు. సీబీఐ దర్యాప్తులో విధానపరమైన లోపాలు, రాజ్యాంగ సూత్రాల ఉల్లంఘన, పుకార్లపై ఆధారపడడంలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు.

►ALSO READ | సుప్రీం కోర్టులో పార్టీ ఫిరాయింపుల కేసు క్లోజ్: బీఆర్ఎస్‎కు ఎదురు దెబ్బ