ఏపీలో కొత్త‌గా 8601 క‌రోనా కేసులు న‌మోదు..86మంది మృతి

ఏపీలో కొత్త‌గా 8601 క‌రోనా కేసులు న‌మోదు..86మంది మృతి

రాష్ట్రంలో క‌రోనా కేసులు భారీగా న‌మోదవుతున్నాయి. అదే స్థాయిలో క‌రోనా త‌గ్గి డిశార్జ్ అవుతున్న రోగుల సంఖ్య పెరిగిపోతుంది.

ఆరోగ్య‌శాఖ అధికారులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం..రాష్ట్రంలో గ‌డిచిన 24 గంటల్లో 8601 కరోనా కేసులు న‌మోదుకాగా.. 86 మంది చనిపోయారు. దీంతో ఇప్పటివరకూ రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 3.6 లక్షలకు చేరింది. వీరిలో 2.6 లక్షల మంది కోలుకుని డిశ్చార్‌ అయ్యారు. మరో 89 వేల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

గ‌డిచిన 24 గంట‌ల్లో అనంత‌పూరం లో – 933, చిత్తూరులో – 495, ఈస్ట్ గోదావ‌రిలో – 1441, గుంటూరులో – 467, క‌డ‌ప‌లో – 639, కృష్ణ లో – 154, క‌ర్నూల్ – 484, నెల్లూరులో -965, ప్ర‌కాశంలో – 589, శ్రీకాకుళం లో – 485, విశాఖ‌లో -911, విజ‌య‌న‌గ‌రంలో – 572, వెస్ట్ గోదావారిలో – 466 కేసులతో మొత్తం 8601 మందికి కరోనా సోకింది.

కాగా రాష్ట్రంలో గత 24 గంటల్లో అన్ని రకాల కోవిడ్‌ పరీక్షలు కలిపి 54463 శాంపిల్స్‌ పరీక్షించారు. వీటితో కలుపుకుని ఇప్పటివరకూ రాష్ట్రంలో పరీక్షించిన శాంపిల్స్‌ సంఖ్య 32 లక్షలకు చేరింది.