కొత్త టారిఫ్‌లోకి 9 కోట్ల టీవీ కనెక్షన్లు

కొత్త టారిఫ్‌లోకి 9 కోట్ల టీవీ కనెక్షన్లు
  • దేశంలో 17 కోట్ల టీవీ కనెక్షన్లు

బ్రాడ్‌కాస్ట్, కేబుల్ టీవీ సర్వీసుల కోసం తీసుకొచ్చిన కొత్త టారిఫ్ విధానంలోకి ఇప్పటి వరకు 9 కోట్ల కనెక్షన్స్‌ మారినట్టు టెలికాం రెగ్యు లేటరీ ట్రాయ్‌ తెలిపింది. దేశవ్యాప్తంగా టీవీ కనెక్షన్లు 17 కోట్లని చెప్పింది. కొత్త విధానంలోకి మారే ప్రక్రియ సమీక్షిస్తున్నామని, వినియోగదారులు ఎలాంటి సమస్యలు ఎదుర్కోవడం లేదంది ట్రాయ్. ‘మా వద్దనున్న డేటా ప్రకారం ఆన్‌ బోర్డింగ్‌ ప్రక్రియ వేగంగా జరుగుతోంది’ అని ట్రాయ్ చైర్మన్ ఆర్‌ఎస్ శర్మ చెప్పారు. కొత్త విధానంలోకి మారిన 9 కోట్ల ఇళ్లలో.. 6.5 కోట్ల కనెక్షన్స్‌ కేబుల్ టీవీ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను, 2.5 కోట్ల ఇళ్లలో  DTHలు వాడుతున్నారు. మొత్తంగా 7 కోట్ల మంది డీటీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను, 10 కోట్ల మంది కేబుల్‌‌ను వాడుతున్నారు. ఇప్పటి వరకు 9 కోట్ల కనెక్షన్లు కొత్త టారిఫ్‌‌లోకి మారడం పెద్ద సంఖ్యనేనని శర్మ చెప్పారు. డీటీహెచ్ ప్రీ పెయిడ్ మోడల్. కస్టమర్లు స్వల్పకాల, దీర్ఘ కాల పాకేజీలను యాక్టివేట్ చేసుకుంటారు. ప్యాక్స్ గడువు ముగిసిపోయాక  నచ్చిన చానళ్లను ఎంపిక చేసుకుంటారని చెప్పారు. ఆపరేటర్స్‌కు అవసరమైన సహాయం చేస్తున్నామని, పలు విషయాల్లో ష్పష్టీకరణ కోసం ఎప్పటికప్పుడు ఆపరేటర్లతో సమావేశమవుతున్నామని చెప్పారు. అదేవిధంగా కొత్త టారిఫ్ విధానం గురించి కస్టమర్లలో కూడా అవగాహన కల్పించడానికి ట్రాయ్‌ ప్లాన్ చేస్తోంది. వినియోగదారుల్లో అవగాహన కోసం సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, అడ్వర్‌టైజ్‌మెంట్, జింగిల్స్‌, ఇతర ప్రొగ్రామ్స్ ద్వారా పెద్ద ఎత్తున క్యాంపెయిన్లను నిర్వహించబోతుంది. వినియోగదారుల ఇష్టం మేరకు వ్యక్తిగత సెటాప్ బాక్స్‌లను కూడా అనుమతించాలని ప్లేయరకు ట్రాయ్ స్పష్టం చేసింది. రెగ్యులేషన్ ప్రకారం, ప్లేయర్లు డిస్కౌంట్లను కూడా ఆఫర్ చేయొచ్చు. అయితే ఆ డిస్కౌంట్లు ప్రాంత ప్రాంతానికి ఒకే విధంగా ఉండాలి. వాటిలో పారదర్శకత ఉండాలి. మల్టికనెక్షన్ హోమ్స్ కోసం స్పెషల్ స్కీమ్స్ ఆఫర్ చేసే విషయంపై కూడా ఆపరేటర్ల నిర్ణయాన్ని ట్రాయ్ తీసుకుంది. కానీ ఈ విషయంపై మరిన్ని వివరాలు అందించేందుకు శర్మ నిరాకరించారు. బ్రాడ్‌కాస్ట్, కేబుల్ సెక్టార్ కోసం ట్రాయ్ తీసుకొచ్చిన కొత్త విధానం ఈ నెల మొదటి నుంచి అమలవుతోంది. నచ్చిన ఛానల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మాత్రమే చూడండి, వాటికే డబ్బులు కట్టడంటూ ఈ విధానం తీసుకొచ్చింది. కొత్త రెగ్యులేటరీ విధానంలో టీవీ చూసే ఖర్చు25 శాతం పెరుగుతుందని క్రిసిల్ రిపోర్టు చేసింది…అయితే ట్రాయ్‌ మాత్రం క్రిసిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిపోర్టును ఖండిస్తోంది.