వర్ని, వెలుగు: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జాకోరా ఎక్స్‌రోడ్డు వద్ద శనివారం ఆర్టీసీ బస్సును ఇసుక టిప్పర్ ఢీకొట్టడంతో 9 మంది ప్రయాణికులు గాయపడ్డారు. బాన్సువాడ డిపోకు చెందిన బస్సు మధ్యాహ్నం బడాపహాడ్ నుంచి వర్ని వైపు వెళ్తోంది. జాకోరా ఎక్స్‌రోడ్డు మూలమలుపు వద్ద బస్సు ఆగగా.. వర్ని వైపు నుంచి ఇసుకతో వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది.
ఈఘటనలో సుమారు 9 మందికి గాయాలయ్యాయి. స్థానికులు వారిని 108 లో ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. టిప్పర్ డ్రైవర్ షేక్నభీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో సుమారు 71 మంది ప్రయాణికులు ఉన్నారు.
