రూ. 90 వేలు పలికిన క్వింటాల్ మిర్చి

 రూ. 90 వేలు పలికిన క్వింటాల్ మిర్చి

ఎండు మిర్చి ఎర్ర బంగారం అయింది. దేశీ మిర్చి ధర మరోసారి ఆల్ టైం రికార్డు సృష్టించింది. వరంగల్ జిల్లా ఎనుమాముల మార్కెట్లో దేశీ మిర్చి ధర ఏకంగా రూ. 90 వేలు పలికి చరిత్ర సృష్టించింది. ఉమ్మడి వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రేలకుంట గ్రామానికి చెందిన మోహన్ రావ్ అనే రైతుకు ఈ రికార్డు ధర  లభించింది. 

రెండోసారి..
వరంగల్ ఎనుమాముల మార్కెట్‌ చరిత్రలో  క్వింటాల్‌ మిర్చి ధర 90వేల రూపాయలు పలకడం ఇది రెండోసారి. గత నెలలో  హనుమకొండ జిల్లా పరకాల మండలానికి చెందిన అశోక్ అనే రైతు పంటకు 90 వేల రూపాయల రికార్డ్ ధర దక్కింది. అతను తెచ్చిన బస్తాల్లో ఒకే బస్తాకు మాత్రం ఈ రేట్ పలికింది.