Age is just a number; not an indicator of potential, performance, అని అంటోంది 91ఏళ్ల బామ్మ.
కాటికి కాళ్లు చాపే వయసులో ఫ్యాషన్ రుచి చూపిస్తోంది వయసు నెంబర్ మాత్రమే అంటూ 91ఏళ్ల బామ్మ తన ప్యాషన్ తో నెటిజన్లను ఉర్రూతలూగిస్తుంది. 1928 నుండి మీ మగవాళ్ల మనసులను దొంగలిస్తున్నా అనే ట్యాగ్ లైన్ తో ఇన్ స్ట్రాగ్రామ్ అకౌంట్ ను హ్యాండిల్ చేస్తుంది. 38లక్షల మంది ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది.
అమెరికాకు చెందిన 91ఏళ్ల హెలన్ రూత్ ఎలామ్ ఇన్ స్ట్రామ్ లో వెరైటీ స్కర్ట్స్ రంగురంగుల ఫ్యాషన్ దుస్తులతో నెటిజన్లను కట్టిపడేస్తుంది. అయితే ఫ్యాషన్ వెనుక ఓ విషాదం ఉందని హెలన్ చెబుతోంది.
83ఏళ్ల వయసులో భర్త, కుమారుడు చనిపోవడంతో మానసికంగా కృంగి పోయింది. ఆ విషాదం నుంచి భయటపడేందుకు సోషల్ మీడియాను అస్త్రంగా ఉపయోగించుకుంటున్నట్లు తెలిపింది. హెలన్ కు ఫ్యాషన్ అంటే మహా పిచ్చి. ఆ పిచ్చితోనే యూత్ ను అట్రాక్ట్ చేసేలా ప్యాషన్ దుస్తుల్లో హోయలొలికిస్తుంది.
91ఏళ్ల వయసులో నీకు ఈ ఫ్యాషన్ ఎందుకే బామ్మ అని ప్రశ్నిస్తే..నేనెప్పుడు ముసలి వాళ్లలా కనిపించాలనుకోను. యుక్తవయసులో ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉండాలనుకుంటున్నా.అందుకే ఈ డ్రెస్ లను ధరిస్తున్నానని చెబుతోంది.
తన మనవరాలు కెన్నెడీ సాయం చేస్తుందని, సోషల్ మీడియా గురించి తనకు అంతగా అవగాహనలేదని, మొత్తం తన మనవరాలే చూసుకుంటుందని హెలెన్ చెబుతుంది.
మొత్తానికి హెలెన్ ఫ్యాషన్ చూస్తుంటే ట్యాలెంట్ కు ఏజ్ తో సంబంధం లేదని అని అనుకోవచ్చనిపిస్తుంది.
