గురుకుల ఎంట్రన్స్‌‌ కు 94 శాతం మంది అటెండ్ : సెట్ కన్వీనర్ కృష్ణ ఆదిత్య

గురుకుల ఎంట్రన్స్‌‌ కు 94 శాతం మంది అటెండ్ : సెట్ కన్వీనర్ కృష్ణ ఆదిత్య

హైదరాబాద్, వెలుగు: రాష్ర్టవ్యాప్తంగా జరిగిన గురుకుల ఎంట్రన్స్ ఎగ్జామ్‌‌కు 94.93 శాతం మంది అటెండ్ అయినట్టు సెట్ కన్వీనర్ కృష్ణ ఆదిత్య తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 492 పరీక్షా కేంద్రాల్లో ఆదివారం పరీక్ష ప్రశాంతంగా జరిగిందని పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. 

ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో 5వ తరగతి అడ్మిషన్లకు, 6 నుంచి 9వ తరగతి వరకు బ్యాక్‌‌లాగ్ సీట్ల భర్తీకి ఈ ఎగ్జామ్‌‌ను నిర్వహించారు. ఈ ఎంట్రన్స్‌‌కు మొత్తంగా1,82,061 మంది అప్లై చేసుకోగా1,72,842 మంది (94.93 శాతం) అటెండ్ అయ్యారని ఆయన వెల్లడించారు.