ఒడిశాలోని ఒక ప్రైవేట్ న్యూస్ ఛానెల్.. జూలై 9న అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పవర్డ్ వర్చువల్ న్యూస్ యాంకర్ 'లిసా'ను ఆవిష్కరించింది. కంప్యూటర్ సాయంతో రూపొందించిన ఈ మోడల్ న్యూస్ యాంకర్.. ఒడిశా సంప్రదాయ చేనేత చీరను ధరించి కనిపించింది. కంపెనీ ప్రకటన ప్రకారం, OTV నెట్‌వర్క్ టెలివిజన్ అండ్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒడియా, ఇంగ్లీష్ రెండింటిలోనూ వార్తలను అందించడానికి లిసా ప్రోగ్రామ్ చేయబడింది.
లిసా బహుళ భాషలు మాట్లాడగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, ఆమె ప్రస్తుతం ఒడియా, ఇంగ్లీష్ వార్తలనే ప్రదర్శించనున్నట్టు కంపెనీ తెలిపింది. ఒడియా టెలివిజన్ జర్నలిజం కృత్రిమ మేధస్సు సాంకేతికతను స్వీకరించడంలో లిసా పరిచయం అనేది ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని పలువురు ప్రశంసిస్తున్నారు.
భవిష్యత్తు లో న్యూస్ ఛానల్ యాంకర్ గా "కృత్రిమ మహిళా"
— HEMA (@Hema_Journo) July 10, 2023
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో దేశంలోనే మొదటిసారి ఒడిశాలో OTV న్యూస్ ఛానల్ ఈ టెక్నాలజీ ఉపయోగించి కృత్రిమ మహిళతో వార్తలు చదివించే విధానాన్ని ప్రారంభించింది. pic.twitter.com/7nmXc3be7p
“రాబోయే రోజుల్లో లిసాను ఒడియాలో మరింత ఇన్వాల్వ్ చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి అన్ని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలోనూ లిసాను చూడవచ్చు, ఫాలో కావచ్చు”అని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
AI న్యూస్ యాంకర్లు వాస్తవిక ప్రసంగం, ముఖ కవళికలను కూడా స్పష్టంగా పలికిస్తారు. కంప్యూటర్-సృష్టించిన ఈ నమూనాలు సరైన ఖచ్చితత్వంతో పాటు భావోద్వేగంతో కూడిన వార్తా కథనాలను కూడా అందించగలుగుతాయి. కొంతమంది AI న్యూస్ యాంకర్లు వీక్షకుల ప్రశ్నలకు నిజ సమయంలో సమాధానం ఇవ్వగలరు. AI న్యూస్ యాంకర్లకు వార్తల పంపిణీ విధానంలో విప్లవాత్మక మార్పులు చేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. వారు బ్రేకింగ్ న్యూస్, 24/7 కవరేజీని అందించగలరు. అయినప్పటికీ, తప్పుడు సమాచారం లేదా ప్రచారాన్ని వ్యాప్తి చేయడానికి AI వార్తా యాంకర్లపైనా ఆందోళనలు నెలకొంటున్నాయి.

