
217 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో తడబడుతోంది. ఓపెనర్ కైల్ మేయర్స్.. మొదటి మ్యాచ్ లో ఢిల్లీపై చూపించిన అదే దూకుడును ఈ మ్యాచ్ లో కొనసాగించాడు. బెన్ స్టోక్స్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో రెండు ఫోర్లు, ఓ సిక్స్ బాదిన స్కోర్ బోర్డు వేగాన్ని పెంచాడు. దీపక్ చాహర్ వేసిన 3 ఓవర్ లో మూడు ఫోర్లు బాదాడు. దీంతో 3 ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు.. 38 పరుగులు చేరింది. ఈ దూకుడుకు 5 ఓవర్లలో లక్నో 73 పరుగులు చేసింది
మోయిన్ అలీ వేసిన 5.3 ఓవర్లో కాన్వేకి క్యాచ్ ఇచ్చి మేయర్స్ ఔట్ అయ్యాడు. దాంతో లక్నో వికెట్లు పడటం ప్రారంభం అయింది. తర్వాత కేఎల్ రాహుల్ (20), దీపక్ హుడా (2), క్రునాల్ పాండ్యా (9). స్టోయినిస్ (21) వెంటవెంటనే ఔట్ అయ్యారు. దీంతో లక్నో 14 ఓవర్లు ముగిసేసరికి 136 పరుగులు చేసి 5 కీలక వికెట్లు కోల్పోయింది.