
హైదరాబాద్, వెలుగు: కమిషన్ఏర్పాటు చేసి, కులగణన సర్వే చేస్తే న్యాయపరమైన చిక్కులు రావని బీజేపీ ఎమ్మెల్యే పాయల్శంకర్అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే ప్రభుత్వాలకు కులగణన గుర్తుకొస్తున్నదని విమర్శించారు. ఆలస్యంగానైనా కాంగ్రెస్ప్రభుత్వం కులగణన చేస్తుండడం మంచి విషయమని చెప్పారు. శుక్రవారం కులగణన తీర్మానంపై చర్చ సందర్భంగా పాయల్ శంకర్ మాట్లాడారు. అసెంబ్లీలో బీసీలు ఎంతమంది ఉన్నారో చూస్తే, రాష్ట్రంలో బీసీల పరిస్థితి ఎట్లుందో అర్థమవుతున్నదన్నారు. బీసీలు ఎప్పుడూ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు.