- చిక్కడపల్లిలో కస్టమర్ ఫిర్యాదు
ముషీరాబాద్, వెలుగు : చిక్కడపల్లి పరిధిలోని అంబేద్కర్ బస్తీలో సోమవారం అర్ధరాత్రి జెప్టో డెలివరీ బాయ్స్ ఓ కస్టమర్ పై మూకుమ్మడి దాడి చేశారు. అంబేద్కర్ బస్తీకి చెందిన సందీప్ రాత్రి జెప్టోలో పెన్సిల్ ప్యాకెట్‌తో పాటు కేక్, పెరుగు ఆర్డర్పెట్టాడు. ఎంతకీ రాకపోవడంతో డెలివరీ బాయ్ కి కాల్చేసి అడిగాడు. అతడు సందీప్‌ను వీఎస్టీ ఎస్పీ గార్డెన్ వద్ద ఉన్న జెప్టో హబ్ కు వచ్చి మాట్లాడాలని కోరాడు. సందీప్ అక్కడకు వెళ్లి ఆర్డర్ కోసం గట్టిగా ప్రశ్నించాడు. దీంతో అక్కడే ఉన్న డెలివరీ బాయ్స్అంతా కలిసి సందీప్‌ను చితకబాదారు. వెంకట్ రాజు అనే వ్యక్తితో పాటు మరికొందరు కలిసి గంజాయి మత్తులో తనపై దాడి చేశారని సందీప్ చిక్కడపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. దాడికి సంబంధించిన సీసీ ఫుటేజీ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
