తిమింగలానికి.. చింపాజీ ముఖం.. బ్రహ్మంగారి వింతా..! టెక్నాలజీ మాయా?

తిమింగలానికి.. చింపాజీ ముఖం..  బ్రహ్మంగారి వింతా..! టెక్నాలజీ మాయా?

ప్రపంచంలో చాలా వింతలు జరుగుతుంటాయి. వాటి గురించి సామాన్య ప్రజలకు అంతగా తెలిసి ఉండదు. ప్రతీ ప్రాణి దేవుడి సృష్టి అనుకుంటారు. కానీ, ఈ మధ్య కాలంలో శాస్త్రవేత్తలు కూడా సొంతగా జీవాన్ని సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు.

అలాంటి ఓ ప్రయత్నంలో నుంచి వచ్చిన జీవం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఓ సీల్ చేప... గొరిల్లాకు పుట్టిన వింత చేప ఫొటో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

చేప శరీరం చేపలా.. ముఖం గొరిల్లాలా ఉన్న ఈ ఫొటో చూసిన చాలామంది ‘ఇది ప్రకృతి వింత. ఇంకా ఇలాంటి విచిత్రాలు ఎన్ని ఉన్నాయో’ అంటూ కామెంట్స్ పెట్టారు. అయితే, ఇది నిజంగా ప్రకృతి వింతేం కాదు. ఈ ఫొటోను ఓ వ్యక్తి ఫొటో షాప్ లో ఎడిట్ చేశాడు. దాన్ని సోషల్ మీడియోలో షేర్ చేసేసరికి.. వైరల్ గా మారింది. ఈ ఫొటో నిజం అనుకున్నవాళ్లంతా నిజం తెలిసేసరికి అవాక్కయ్యారు. 

గొరిల్లా పిల్లల్ని కంటుంది. చేప గుడ్లు పెడుతుంది. ఈ విషయం తెలుసుకోకుండా కల్పిత ఫొటో చూసి నిజం అని ఎలా నమ్మారని కొందరు నెటిజన్స్.. జనాలకు చురకలు అంటిస్తున్నాడు.