ప్రాణాలు తీసిన ఈదురుగాలులు.. తెప్ప పైనుంచి నీళ్లలో పడి మృతి

ప్రాణాలు తీసిన ఈదురుగాలులు.. తెప్ప పైనుంచి నీళ్లలో పడి మృతి

నల్గొండ అర్బన్, వెలుగు : చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్య కార్మికుడు ఈదురుగాలులకు తెప్పపై నుంచి నీళ్లలో పడి చనిపోయాడు. మాడుగుల పల్లి మండలం పెద్దదేవులపల్లికి చెందిన అంబటి నాగరాజు (35) నల్గొండ పరిధిలోని పానగల్లులో ఉంటున్నాడు. పక్కనే ఉన్న ఉదయసముద్రంలో రోజు మాదిరిగానే గురువారం సాయంత్రం చేపల వేటకు వెళ్లాడు. చెరువు మధ్యలోకి వెళ్లిన తర్వాత ఈదురుగాలులు మొదలవడంతో తెప్ప పైనుంచి నీటిలో పడిపోయాడు. ఒడ్డుకు చేరేందుకు ఈదుకుంటూ వస్తుండగా ఎదురుగాలులు, అలలకు తట్టుకోలేక నీటిలో మునిగిపోయాడు. గురువారం రాత్రి వరకు గాలించినా దొరకలేదు. శుక్రవారం పానగల్ ఉదయ సముద్రం చెరువులో డెడ్​బాడీ లభ్యమైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నల్లగొండ టూ టౌన్ ఎస్సై రాజశేఖర్ రెడ్డి తెలిపారు.