V6 News

ఫొటో కోసం ఈ పిచ్చి పనులేంటి..? హోటల్‎లో అభిషేక్ చేయిపట్టి లాగిన యువతి

ఫొటో కోసం ఈ పిచ్చి పనులేంటి..? హోటల్‎లో అభిషేక్ చేయిపట్టి లాగిన యువతి

ఇండియాలో క్రికెటర్లు, సినీ హీరోలకు ఫుల్ క్రేజ్ ఉంటుంది. తమ అభిమాన ఆటగాళ్లు, హీరోలను దేవుళ్లు మాదిరిగా ఆరాధిస్తారు అభిమానులు. అంతులేని అభిమానం, ప్రేమ కురిపిస్తారు. తాము అభిమానించే వారిని ఒకసారిని చూడాలని.. ఒక ఫొటో దిగాలని ఎగబడుతుంటారు. కొన్నిసార్లు అభిమానుల అంతులేని అభిమానమే సెలబ్రెటీలకు ఇబ్బందికరంగా మారుతుంది. తాజాగా టీమిండియా స్టార్ క్రికెటర్, ఎస్ఆర్‎హెచ్ ఓపెనర్ అభిషేక్ శర్మకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. 

ఐపీఎల్ 19లో భాగంగా శనివారం (ఏప్రిల్ 25) రాజస్థాన్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ఆటగాళ్లు హోటల్‎కు వెళ్తుండగా అభిషేక్‎కు ఊహించని పరిణామం ఎదురైంది. హోటల్‎లో ఓ యువతి ఫొటో కోసం అభి చేయి పట్టుకుని లాగింది. ఈ ఊహించని ఘటనతో ఒక్కసారిగా షాక్‎కు గురైన హైదరాబాద్ ఓపెనర్ చేయి వెనక్కి లాక్కున్నాడు. 

వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అమ్మాయిని సముదాయించారు. ఫొటో కోసం యువతి అభి చేయి పట్టుకుని లాగిన వీడియో సోషల్ మీడియా వైరల్‎గా మారింది. అమ్మాయి చేయి పట్టుకుని లాగడంతో అభిషేక్ తీవ్ర అసౌకర్యానికి గురైనట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. ఫొటో కోసం ఈ పిచ్చి పనులేంటని కొందరు ఏకీపారేస్తుండగా.. రోజురోజుకు అమ్మాయిల్లో అభి క్రేజ్ పెరిగిపోతుందని ఇంకొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. 

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఐపీఎల్-19లో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు మరోసారి మెరిశారు. ఇషాన్ కిషన్ (31 బాల్స్లో 11 ఫోర్లు, 3 సిక్స్లతో 74), అభిషేక్ శర్మ (29 బాల్స్లో 11 ఫోర్లు, 1 సిక్స్త్ 57) మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకోగా.. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్కు చెక్ పెట్టింది. దాంతో ఎస్ఆర్ హెచ్ వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. టాస్ ఓడిన రాజస్తాన్ 20 ఓవర్లలో 228/6 స్కోరు చేసింది. వైభవ్ సూర్యవంశీ (37 బాల్స్లో 5 ఫోర్లు, 12 సిక్స్లతో 103), ధ్రువ్ జురెల్ (51) చెలరేగారు. తర్వాత హైదరాబాద్ 18.3 ఓవర్లలో 229/5 స్కోరు చేసింది. ఇషాన్కు 'ప్లేయర్ ఆఫ్ ద 'మ్యాచ్' అవార్డు లభించింది.