V6 News

బిగ్ ట్రబుల్‌లో చెన్నై సూపర్ కింగ్స్.. జస్ట్ 26 రన్స్‌కే 3 వికెట్లు డౌన్

బిగ్ ట్రబుల్‌లో చెన్నై సూపర్ కింగ్స్.. జస్ట్ 26 రన్స్‌కే 3 వికెట్లు డౌన్

IPL 2026లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఆదిలోనే తడబడింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే, గుజరాత్ టైటాన్స్ బౌలర్ల ధాటికి కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కేవలం 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఇబ్బంది పడింది. టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమవడంతో జట్టుపై బాగా ఒత్తిడి పెరిగింది. ప్రత్యర్థి గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ చెన్నై బ్యాటర్లను ఇబ్బందులకు గురి చేశారు. పవర్‌ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోవడం జట్టుకు పెద్ద దెబ్బగా మారింది.

మొదట బ్యాటింగ్ కి వచ్చిన సీఎస్కే ఓవపెనర్లు సంజు శాంసన్, రుతురాజ్ జోడి ఆశించిన స్థాయిలో ఆరంభం అందించలేకపోయింది. ఈ ఇద్దరి మధ్య నెలకొన్న 21 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. కగిసో రబాడ బౌలింగ్ (3.3 ఓవర్లో)లో భారీ షాట్ ఆడగా అది కాస్త బ్యాట్ ఎడ్జికి తాకడంతో బంతి నేరుగా వికెట్ కీపర్ జోస్ బట్లర్ చేతిలో వెళ్లి పడటంతో సంజు మైదానం వీడాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఊర్విల్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. కేవలం 3 బంతులు ఆడి ఒక ఫోర్ కొట్టిన తర్వాత బంతికే రబాడ బౌలింగ్ (3.6 ఓవర్లో)లోనే జేసన్ హోల్డర్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కి వెళ్లిపోయాడు. 
 
అనంతరం క్రీజులోకి వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ ఈసారి ఘోరంగా విఫలమయ్యాడు. ఎలాంటి ఇంపాక్ట్ చూపించకుండానే మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ లో వికెట్ కీపర్ జోస్ బట్లర్ కి క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. దీంతో 26 పరుగులకే కీలకమైన వికెట్లని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కోల్పోయి, తీవ్ర కష్టాల్లో పడింది. కాగా, తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన డెవాల్డ్ బ్రెవిస్ మెరుపు మెరిపించకుండానే మైదానం వీడాడు. కేవలం 5 రన్స్ మాత్రమే చేసి మానవ్ సుథార్ బౌలింగ్ లో శుభ్‌మన్ గిల్ కి క్యాచ్ ఇచ్చి డగౌట్ కి వెళ్లిపోయాడు. దీంతో 37 పరుగులకే 4 వికెట్లని నష్టపోయింది సీఎస్కే. 

మరోవైపు, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాత్రం నిలకడగా బ్యాటింగ్ కొనసాగుతున్నాడు. ఇక శివమ్ దూబే వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్స్ ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడైనా మిడిల్ ఆర్డర్ బాధ్యత తీసుకుని ఇన్నింగ్స్‌ను నిలబెట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతే చెన్నై తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుతం మ్యాచ్ పూర్తిగా గుజరాత్ జట్టు వైపు మొగ్గు చూపుతోంది. చెన్నై తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి.