భూలోక ఇంద్ర భవనం.. కటారా టవర్స్

భూలోక ఇంద్ర భవనం.. కటారా టవర్స్

దోహా : ఖతర్​ జాతీయ పతాకంపై ఉండే రెండు ఖడ్గాల చిహ్నాన్ని తలపించే గొప్ప నిర్మాణం.. ఆ దేశ రాజధాని దోహాలో ఆవిష్కృతమైంది. దీన్ని చూసి కేవలం కట్టడమే అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే.. అందులో రాఫెల్స్, ఫెయిర్​ మోంట్​ అనే రెండు లగ్జరీ హోటళ్లు  ఉన్నాయి. ఈ అపురూపమైన కట్టడానికి ‘కటారా టవర్స్’ అని పేరు పెట్టారు. 

ఇందులో రాఫెల్స్, ఫెయిర్​ మోంట్​ హోటళ్ల భవంతులు చెరో 3 లక్షల చదరపు మీటర్ల పరిధిలో విస్తరించి ఉన్నాయి. ఖతర్​ లోని పర్షియన్​ గల్ఫ్​ సముద్ర తీరంలో ఈ చూడచక్కటి నిర్మాణం ఉంది. ఫెయిర్​మోంట్​ హోటల్​లోని గోడలపై బ్యూటిఫుల్​ టెక్స్చర్​ కోసం 18 క్యారెట్ల బంగారాన్ని వాడటం విశేషం.  ఇదే హోటల్​లో ప్రపంచంలోనే పెద్ద షాండ్లియర్ కూడా ఉంది. దీన్ని 183 అడుగుల ఎత్తులో బిగించారు. ​